– బీఆర్‌ఎస్ అసెంబ్లీ అభ్యర్థిని హరిప్రియ
నవతెలంగాణ-ఇల్లందు
ప్రజలు కష్టసుఖాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ అని, కేసీఆర్‌ను ఢకొీట్టే దమ్ము ఎవరికీ లేదని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని హరిప్రియ అన్నారు. ఇల్లందు నియోజక వర్గంలోని గార్ల మండలం పుల్లూరు, బీఆర్‌ఎన్ తండా, రాజు తండా, కోట్యా నాయక్ తండ, పోచారం గ్రామపంచా యతీలలో ఇంటి ఇంటికి బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో లబ్ధి పొందే విధంగా ఎటువంటి మధ్యవర్తి లేకుండా తెలంగాణలోని పుట్టిన ప్రతి బిడ్డకు సంక్షేమ పథకాలు అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూసే విధంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అది కేసీఆర్ వల్లే సాధ్యమని గర్వంగా చెప్తున్నానన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తే సిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు మెజారిటీ స్థానాలలో అభ్యర్థులు లేరన్నారు. డిపాజిట్లు రావన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. మళ్ళీ మీ ఆడబిడ్డగా దీవించి గెలిపించండి మీ గడపగడపకు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తానని అన్నారు.