– 10ఏళ్ళల్లో దుబ్బాక కు కొత్త చేసిందేమి లేదు
– దుబ్బాక ఎమ్మెల్యే ది కాంగ్రెస్ పై బురదజల్లే ప్రయత్నమే
– ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అవినీతి ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ నాయకుల ఆరోపణ
– మున్సిపాలిటీలో కమిషనర్ దొంగ బిల్లులు పెట్టక పోతే దాడి చేయించలేదా…?
– ఎమ్మెల్యే అండతో మున్సిపాలిటీలో అవినీతి, అక్రమాలు పెరిగాయని మండిపాటు
– ఎంపీగా గెలిచి దుబ్బాకకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలి
– దుబ్బాక అభివృద్ధి ఘనత స్వర్గీయ మాజీ మంత్రి, ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డిదే
– దుబ్బాక రెవెన్యూ డివిజన్ చెరుకు శ్రీనివాస్ రెడ్డితోనే సాధ్యం
– కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల దేవేందర్
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
దుబ్బాక కు మొట్టమొదటి శత్రువులు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డిలేనని, బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ళ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకకు చేసింది ఏమి లేదని, ఎమ్మెల్యే గా గెలిచి 10 నెలలు గడుస్తున్న దుబ్బాక నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకున్న పాపానపోలేదు.తాజాగా కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పని తీరు జిర్ణించుకోలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ సంబరాల పేరుతో నాలుగు సంవత్సరాలుగా మున్సిపాలిటీలో అనేక అవినీతి అక్రమాలకు దొంగ బిల్లులు పెట్టకపోతే గత కమిషనర్ గణేష్ రెడ్డి పై దుబ్బాక ఎమ్మెల్యే దాడి చేయించి,అవినీతిని పెంచి పోషించారని,కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు కొత్తకు లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల దేవేందర్ అన్నారు.బుధవారం సీఎస్ఆర్ దుబ్బాక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దుబ్బాక ఎమ్మెల్యే మున్సిపాలిటీలో కాగితాల పైననే 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించాడని, ఆయన అండతో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బతుకమ్మ సంబరాలు,హరితహారం పేరుతో చైర్మన్ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని. అన్నారు. అవినీతి బిల్లులు మంజూరు చేయకపోతే కమిషనర్ పైన ఎమ్మెల్యే దాడి చేయించారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించడం లేదని కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. మీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రఘునందన్ రావు పై వివక్ష చూపలేదని ఆయన ప్రశ్నించారు. దుబ్బాక కు మొట్టమొదటి శత్రువు హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి లేనని వారు ఆరోపించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కి నిజంగా దుబ్బాక మున్సిపాలిటీ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే దుబ్బాక మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపైన విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన 10 మాసాల అవుతున్న దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలపై దరఖాస్తులు తీసుకున్నవా అని ప్రశ్నించారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి,దుబ్బాక మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన ఘన చరిత్ర మాజీ మంత్రి, స్వర్గీయ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డి గారిదేనని కొనియాడారు. కోడి కత్తి,మద్యం ,డబ్బులు పంచిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీని, దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ జిల్లా నాయకులు మల్లు గారి చంద్రారెడ్డి, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉషయ్య గారి రాజిరెడ్డి, మున్సిపాలిటీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్ణంపల్లి రమేష్ గౌడ్, తోట్ల. చెంద్రం తదితరులు ఉన్నారు.