ఎస్సీవర్గీకరణతో ఎవరికీ అన్యాయం జరగదు

With SC classification
No one is wronged– ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఎస్సీ వర్గీకరణతో ఎవరికీ అన్యాయం జరగదని ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌ఏ సంపత్‌ కుమార్‌ వెల్లడించారు. అయితే ఇంకెవరికీ న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు. ఎస్సీ వర్గీకరణ కోసం 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నట్టు తెలిపారు. మాలలతో పోల్చితే మాదిగల జనాభా రెండింతలు ఉందని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏకసభ్య కమిషన్‌ వేసి నివేదిక ఆధారంగా మూడు గ్రూపులు చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో విడిపోయాక కొన్ని కులాలు తెలంగాణలో లేవన్నారు. అందువల్ల మూడూ మూడు గ్రూపులు మాత్రమే చేసిందన్నారు. మూడు గ్రూప్‌లను కుదించేందుకు భావస్వరూప్యతా, సంప్రదాయాలు కలగాల్సిన కులాలను ఒక్కటి చేశారని తెలిపారు. ఏ కులం కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు.