ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరూ…?

 – ఒక్క బస్ లో లెక్కకు మించిన విద్యార్థుల తరలింపు
 – బస్ టాప్ పైన కూర్చున్న విద్యార్ధులు
నవతెలంగాణ- తంగళ్ళపల్లి: ఒకే బస్సులో పరిమితికి మించి విద్యార్థులు తరలిస్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు వహిస్తారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి నిత్యం తంగళ్ళపల్లి మండలం మండేపల్లి మోడల్ స్కూల్ కు ఉదయం పాఠశాల సమయానికి వెళ్లే ఆర్టీసీ బస్సులో మంగళ వారం దాదాపు 250 మందికి పైగా విద్యార్థులు ఒకే బస్సులో ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు నిత్యం విద్యార్థుల కోసం, ప్రయాణికుల కోసం ఉదయం ఒక బస్సు రెండు ట్రిప్పులు మరొక బస్సు  ట్రిప్పులు, సాయంత్రం మూడు ట్రిప్పులు బస్సులు నడుపుతున్నారు. కానీ సరిపోవడం లేదు. విద్యార్థులకు పాఠశాల సమయం మించి పోవడంతో విద్యార్థులు ఒకే బస్సులో 220 మందికి పైగా వెళుతున్నారు. విద్యార్థులకు పాఠశాల సమయంలో  నడపాల్సిన ఆర్టీసీ అధికారులు మొదటి ట్రిప్పు వెళ్లి వచ్చిన తర్వాత మరో ట్రిప్పును నడుపుతున్నారు.  పాఠశాలకు ఆలస్యం అవుతుందని విద్యార్థులు ఒకే బస్సులో ఇలా వెళుతున్నారు. విద్యార్థులు లెక్కకు మించి, పరిమితికి మించి ఎక్కడంతో బస్సు ఒక పక్కకు వంగిపోయింది. తంగళ్ళపల్లి మండల కేంద్రం నుండి మండేపల్లి గ్రామం మీదుగా టెక్స్టైల్ పార్కులో ఉన్న మోడల్ స్కూల్ వద్దకు వెళ్లే దారి మొత్తం మూలమలుపులతో ప్రమాదకరంగా ఏదైనా మూలమలుపు వద్ద కానీ ఏదైనా ప్రమాదం జరిగితే భారీ మొత్తంలో నష్టం జరుగుతుందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఆ నష్టానికి, ఆ ప్రమాదానికి ఎవరు బాధ్యులు వహిస్తారని  తల్లిదండ్రులు ఆర్టీసీ ధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై సిరిసిల్ల ఆర్టిసి డిపో మేనేజర్ మనోహర్ ను వివరణ కోరగా సిరిసిల్ల నుండి మండపల్లి మోడల్ స్కూల్ కు వెళ్లే రూట్ మ్యాప్ ను పరిశీలించానని తెలిపారు. ఒకే బస్సులో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించిన ఆ బస్సు డ్రైవర్ ఏ ప్రకాష్ పై చర్యలు తీసుకుంటామని డిఎం మనోహర్ తెలిపారు. అంతేకాకుండా ఆ రూట్ కు వెళ్లే బస్సుల సమయాలను కూడా మార్పులు చేసినట్లు ఆయన వివరించారు.