
నవతెలంగాణ-గోవిందరావుపేట : రానున్న రెండు రోజుల్లో బారి నుంచి అతిబారి వర్షాలు కురుస్తున్న యన్న సమాచారమ్ నేపథ్యంలో ప్రజలెవరు ముంపు ప్రాంతాలకు వెళ్లకూడదని పసర పోలీస్ స్టేషన్ ఎస్.ఐ ఏ కమలాకర్ అన్నారు. గురువారం మండలంలోని బుసాపురం గ్రామ ప్రజలందరినీ ఉద్దేశించి ముఖ్యమైన సూచనలు చేయడం జరిగింది. వర్షాల వల్ల వాగులు, కాలువలు, చెరువులు ఉప్పొంగే అవకాశం ఉంది. కావున ఎవరు కూడా వాగుల వద్దక కానీ, చెరువుల వద్దకు కానీ వెళ్లకూడదు అని ముఖ్యంగా యువకులు ఎవరు ఈతకు గాని, చేపలు పట్టుటకు గాని ముంపు ప్రాంతాల వద్దకు వెళ్లవద్దు అని అన్నారు. జాలర్లు కూడా వర్షాలు పడుతున్న సమయం లో చేపలు వేటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు మరియు పూరాతన ఇంటి లాలో వుండకూడదని ఇంటి గోడలు కూలే ప్రమాదం వుంటుందని అని తేలిపారు. ఏదేని ప్రమాదం సంభవిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని తెలియచేసారు.