– లోలోన అంతర్మధనం..
– నాలుగోసారి గెలుపు ఎవ్వరినీ వరించునో..
– అభ్యర్థుల్లో నెలకొన్న ఉత్కంఠణ
నవతెలంగాణ-శంకర్‌పల్లి
లోక్‌సభ అభ్యర్థులు గెలుస్తామని బయటికి చెబుతున్నా, లోలోన మాత్రం అంతర్మధనం పడుతున్నారు. చేవెళ్ల పార్లమెంట్ కైవసం పై ఎవరి ధీమా వారిదే.. గ్రామీణ ఓట్లే కీలకం.. గెలుపును నిర్ధారించలేని వీరే గ్రామీణ ప్రాంతంలో పెరిగిన పోలింగ్ శాతంపై లెక్కలు వేసుకునే పనిలో అభ్య ర్థులు, నాయకులు నిమగమైవుతున్నారు. మూడు సార్లు ఎన్నికలు జరుగగా రెండుసార్లు బీఆర్‌ఎస్ కైవసం చేసుకోగా, మొదటిసారి కాంగ్రెస్ విజయం, నాలుగోసారి విజయం ఎవ్వరిని వరించనుందో..
చేవెళ్ల ఎంపీ సీటు విజయంపై మూడు ప్రధాన పార్టీలో ధీమా కనిపిస్తున్న లోలోన మాత్రం బెంగ స్పష్టంగా కనిపిస్తుంది. గెలుపు పై పూర్తి నమ్మకంతో ఉన్న లోన మాత్రం లెక్కలు తారుమా రయ్యే అవకాశం ఉన్నాయని పలువురు అను మానాలు వ్యక్త పరుస్తున్నారు. పోలింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ఎవరికి లాభం జరిగిందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చేవెళ్ల పార్ల మెంట్‌లో గ్రామీణ ప్రాంత నియోజక వర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. ఇది ఎవరికి లాభం చేకూర్చుతుందోనని దానిపై అభ్య ర్థుల్లో ఆందోళన కలిగిస్తుంది. పెరిగిన పోలింగ్ తమకే లాభం అని చెబు తున్న లోపల మాత్రం భయం స్పష్టంగా కనిపిస్తుంది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటికే మూడుసార్లు ఎన్నికలు జరగా ఇందులో రెండుసార్లు బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా మొదటి సారి మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నాలుగోసారి ఎన్నికల్లో విజయం ఏ పార్టీ సొంతం చేసుకోనుందోనని ఉత్కంఠ నెల కొంది. దీనిపై ఎవరికి వారే లెక్కలు వేసుకునే పనిలో బిజిబిజీగా ఉన్నారు.