– పౌరసత్వం కోసం ఇవి అవసరం లేదు
– సీఏఏ కింద నిబంధనలు సడలింపు
న్యూఢిల్లీ : వివాదాస్పద సీఏఏ కింద కేంద్రం నిబంధనలను సడలించింది. డిసెంబర్ 31, 2014, అంత కంటే ముందు భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లకు చెందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు.. ఈ దేశాల చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, భారత్ నుంచి చెల్లుబాటు అయ్యే వీసా లేకుండా ఇప్పుడు భారత పౌరసత్వాన్ని పొందవచ్చు. ఈ మేరకు కేంద్రం సోమవారం సీఏఏ,2019 నియమాలను నోటిఫై చేసింది. దరఖాస్తుదారు తల్లిదండ్రులు, తాతలు లేదా ముత్తాతలలో ఒకరు ఈ దేశాల నుంచే వచ్చారనేందుకు ”ఏదైనా ఒక పత్రం” చూపిస్తే వారి జాతీయతను నిరూపించటానికి సరిపోతుంది. వీసాకు బదులుగా, స్థానిక సంస్థలో ఎన్నికైన సభ్యుడు జారీ చేసిన సర్టిఫికేట్ కూడా సరిపో తుంది. నోటిఫి కషన్‌తో డిసెంబర్ 2019లో ఆమోదించబడిన చట్టంలో ఊహించినట్టుగానే ఈ మూడు దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం మంజూరు చేసే ప్రక్రియను కేంద్రం సులభతరం చేసింది. ఈ నిబంధనలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ పాస్‌పోర్ట్, భారత్ జారీ చేసిన రెసిడెన్షియల్ పర్మిట్ అవసరం అనే కేంద్రీకరణను వాస్తవంగా తొలగించారు. దీనికి బదులుగా, జనన, విద్యా సంస్థ సర్టిఫికేట్ (ఏ రకమైన గుర్తింపు పత్రమైనా), ఏదైనా లైసెన్స్ లేదా సర్టిఫికేట్, దరఖాస్తుదారు తమ పౌరుడని రుజువు చేసే భూమి లేదా అద్దె రికార్డులు,