
యాదాద్రి భువనగిరి జిల్లాలో 39 బాయిలు రైస్ మిల్లులకు రబీ, ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని, ధాన్యం నిల్వ చేసుకునే సామర్థ్యం రైస్ మిల్లుల వద్ద లేదా అని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మార్త వెంకటేశం తెలిపారు. సోమవారం అయిన విలేకరులతో మాట్లాడుతూ రబీ 2022-2023 సీజన్ కు సంబంధించి 1,80,000 టన్నులు, ఖరీఫ్ 2023-24 సీజన్ సంబంధించి 2,20,000 టన్నులు ధాన్యం దిగుమతి చేసుకున్నామని, ప్రస్తుతం మా మిల్లులలో 5,40,000 టన్నుల ధాన్యం సుమారుగా నిల్వ ఉన్నదని , జిల్లాలో 39 బాయిల్డ్ రైస్ మిల్లులో ధాన్యం విలువ కెపాసిటీ సుమారు 3,00,000 మాత్రమేనని, 2,40,000 టన్నుల ధాన్యం మా యొక్క మిల్లు ఆవరణలో, ప్రభుత్వ ప్రైవేటు గోదాములలో నిల్వ ఉన్నాయని తెలిపారు. మా యొక్క మిల్లుల వద్ద ఇంక నువ్వు దిగుమతి చేసుకోవాల్సిన లారీల ధాన్యం సుమారుగా 10,000 టన్నులు ఉందని, ఈ ధాన్యాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు దిగుమతి చేసుకుంటామని, ప్రస్తుతం మా వద్ద దిగుమతికి స్థలం లేనందున దిగుమతి చేసుకోలేకపోతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కోట మల్లారెడ్డి, కోశాధికారి గారి శెట్టి అశోక్ లు పాల్గొన్నారు.