– బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బడిబాట కార్యక్రమంలో భాగంగా మద్నూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు శుక్రవారం నాడు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వ చదువుల పట్ల అవగాహన కల్పించారు ప్రైవేట్ చదువులు వద్దు ప్రభుత్వ చదువులే ముద్దు అంటూ విద్యార్థులకు ప్రభుత్వ సౌకర్యాల గురించి తెలియజేశారు. ఈ బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు మారుతి, చంద్రశేఖర్, రాజేందర్, పాల్గొనగా ఉపాధ్యాయుల బడిబాట కార్యక్రమానికి రథం గల్లి విద్యార్థులు ఉపాధ్యాయుల అవగాహన పట్ల ఆనందం వ్యక్తపరిచారు.