– ఉపాధ్యాయ ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్ షెడ్యుల్‌లో రంగారెడ్డికి మినహాయింపు
– హైకోర్టు ఉత్తర్వులు వచ్చే వరకూ ఆగాల్సిందే..
– తమకు ప్రమోషన్లు, బదిలీలు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఎప్పుడెప్పుడా అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ ప్రమోషన్లు, ట్రాన్స్‌పర్స్‌కు ప్రభుత్వం షెడ్యుల్ విడుదల చేసింది. దాంతో రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులకు మాత్రం నిరాశే మిగిలింది. వివిధ ప్రాంతాల నుంచి వివిధ కారణాలతో ఫైరవీలతో జిల్లాలోకి వచ్చి చేరిన అదనపు ఉపాధ్యాయులతో సొంత జిల్లా ఉపాధ్యాయ ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో అదనపు ఉపాధ్యాయులు ఉండటంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులను ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు బదిలీ చేయాలని.. సొంత జిల్లా ఉపాధ్యాయులు అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయు లు కొందరు కోర్టు వెళ్లారు. ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకూ జిల్లాలో ఉపాధ్యాయులు ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర ్‌లు లేవని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లా ఉపాధ్యాయ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో అంతర జిల్లా ఉపాధ్యాయులు సుమారు 400 మంది అదనపు పోస్టుల్లో ఉన్నారు. దీంతో ఇక్కడ కొంత ఉద్యోగులు వచ్చే అవకాశం లేదు. ఉన్నవారి ప్రమోషన్లు వచ్చే పరిస్థితి లేదు. దీనితో ఈ ప్రాంతంలోని ఉపాధ్యాయులు, నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతున్నది. జిల్లాలోకి వివిద కారణాలతో వచ్చిన చేరిన ఉపాధ్యాయులను సర్థుబాటు చేసి మాకు న్యాయం చేయాలని ఉపాధ్యాయులు కోర్టు ఆశ్రయించా రు. ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారించి.. అర్హులైన ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు ఇవ్వాల్సింది పోయి.. కోర్టు నెపంతో ఎన్నో ఏండ్లుగా స్థానికేతరులు ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తు స్థానికులకు అన్యాయం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అదనపు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
జిల్లాలోకి వివిధ కారణాలు, పైరవీలతో వచ్చిన అదనపు ఉపాధ్యాయుల విషయంలో చర్యలు తీసుకోవాలి. స్థానిక ఉపాధ్యాయ ఉద్యోగులు సమస్యలు పరిష్కారించాలి. ఎన్నో ఏండ్లు పదోన్నతులు, బదిలీల కోసం ఎదురు చూస్తున్న రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయ ఉద్యోగు లకు, ప్రస్తుతం ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్స్ షెడ్యూల్‌లో భాగంగా పదోన్నతులు, బదిలీలు అవకాశం కల్పించాలి.
– కె. గోపాల్‌నాయక్, టీఎస్‌యూటీఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు