స్వేచ్ఛ లేని ఈ జన్మ
అమ్మ వరకే బంధమా..
విజ్ఞానపు విహాంగాలు
విహరించే నేడు
అంతొద్దని అందురు పుట్టి
వంటగదికే పరిమితమా..
భారతీయులందరూ సోదర
సోదరీమణులని నేర్పిన ప్రతిజ్ఞ
నేడు దిక్కులన్నీ పెక్కుటిల్లేలా
రోధిస్తున్నాయి
ఆకాశానికి నిచ్చెనలేస్తున్న సమాజమా ..
ఆలోచించుకో ..అమ్మలను కాపాడుకో..
– ఎనమల్ల సరిత