రైతు రుణమాఫీపై ఆంక్షలు వద్దు: సీపీఐ

No restrictions on farmer loan waiver: CPIనవతెలంగాణ – చండూరు 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న రెండు లక్షల రైతు రుణమాఫీపై  ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నలపరాజు రామలింగయ్య డిమాండ్ చేశారు. శనివారం సీపీఐ కొండాపురం,  పుల్లెంల  గ్రామ శాఖ, సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా రూ.2 లక్షల రైతు రుణమాఫీని ఎలాంటి షరతులు విధించకుండా రైతాంగాన్ని అదుకొని రెండు లక్షల రుణమాఫీ అమలు చేయాలని, 2018 డిసెంబర్ నెల కటాఫ్ డేట్ పెట్టడం వలన 2018 డిసెంబర్ కంటే ముందు రైతు రుణం తీసుకున్న రైతాంగం నష్టపోతారని, రైతు రుణమాఫీని తెలంగాణ రైతాంగానికి అందరికీ వర్తింపు  చేయాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి నలపరాజు  సతీష్ కుమార్ సహాయ బొడ్డు వెంకటేశ్వర్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బరిగెల వెంకటేష్ ఏఐటీయూసీ మండల అధ్యక్షులు దొటి వెంకన్న,  ఉషయ్య, శాఖ కార్యదర్శిలు చివర్ల లింగస్వామి ,ఇరిగి సంజీవ  నాయకులు ఎండీ  కరీం, మందడి వెంకట్ రెడ్డి,బోయపల్లి అంజయ్య, గడ్డం యాదయ్య, ఇరిగి గోపయ్య, గడ్డం మల్లయ్య, శ్రీశైలం,ఐతగొని వెంకటనర్సు, ఇరిగి నారాయణ ఇరిగి వెంకన్న, జనార్ధన్, చమకూరు యాదయ్య, భీమరాజు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.