ఉచిత ప్రయాణంపై పర్యవేక్షణేదీ?

తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇది హర్షించదగిన విషయమే. కానీ అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఎక్కడా పర్యవేక్షించిన దాఖలాలు లేవు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ప్రయాణి కులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచకపోగా, అనేక చోట్ల ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను తగ్గించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా దూర ప్రాంతా లకు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్‌లలో వేచి ఉండాల్సి వస్తుంది. దీన్ని సరిదిద్దకుంటే భవిష్యత్‌లో మహాలక్ష్మి పథకం ఆభాసుపాలు కాక తప్పదు.ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ ఆర్టీసీకి గొప్ప పేరుంది. అత్యధికంగా ఈ బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. ఈ సంస్థ 6,479 స్వంత, 2,618 అద్దె బస్సులతో కలిపి మొత్తము 9,097 బస్సులను నడుపుతోంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 21 డివిజన్లలో 99 బస్‌డిపోల్లో అన్ని స్థాయిల్లో 44,648 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తు న్నారు. మహాలక్ష్మి స్కీమ్‌ను ప్రారంభించక ముందు 69 శాతం ఆక్యుపెన్సీ రెషియాతో బస్సులు నడుస్తుండగా..ప్రస్తుతం 90 శాతానికి పెరిగింది. సగా నికి పైగా డిపోల్లో వంద శాతం అక్యుపెన్సీతో ప్రయాణికులు వెళ్తున్నారు. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లోని మహిళలు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుంటున్నారు. గతం కన్నా ఇరవై శాతానికి పైగా ప్రయాణి కుల సంఖ్య పెరగడం ఇందుకు నిదర్శనం. సగటున రోజుకు 35 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు ఆర్టీసీ ఎండి సజ్జనార్‌ ప్రకటించారు. ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ, ఒక్క బస్సును కూడా పెంచలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా రోజు వారి ప్రయాణం చేసే విద్యార్థులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు తంటాలు పడుతున్నారు. వీకెండ్‌, సోమ వారాలు.. ఇతర సెలవు రోజుల్లో ఉద్యోగులు, విద్యార్థులు స్వస్థ లాలకు ఆర్టీసీ బస్సులో రావాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ఎక్స్‌ప్రెస్‌ బస్సులు తగ్గించడం, సూపర్‌ లగ్జరీ బస్సులు సరిపోక పోవడంతో హైదరా బాద్‌ నుండి స్వస్థలాలకు వచ్చి వెల్లడం ఫజిల్‌గా మారింది. కరీంనగర్‌ రీజియన్‌ పరిధిలో 11 డిపోల్లో 207 ఎక్స్‌ప్రెస్‌ బస్సులుండగా గతంలో వందకు పైగా హైదరాబాద్‌కు వేసే వారు.. వాటి సంఖ్యను తగ్గించడం వల్ల ప్రస్తుతం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. హైదరాబాద్‌ రూట్లలో ఎక్స్‌ప్రెస్‌ బస్సులో వెళ్లాల్సి ఉన్న ప్రయా ణికులకు బస్సులు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంపై బస్టాండ్‌లోని మేనేజర్‌, ఇతర సిబ్బంది నుండి ప్రయాణికులకు స్పందన కరువవుతోంది. బస్టాండ్‌లో ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల సమయ వేళలను ప్రదర్శించడం లేదు. సూపర్‌ లగ్జరీ బస్సులో వెళ్లేవారు అడ్డాన్స్‌ బుక్‌ చేసుకుంటున్నారు. ఇందుకు ఒక టికెట్‌పై అద నంగా సుమారు 30 నుండి 40 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నది ఆర్టీసీ.
మహాలక్ష్మి పథకంలో మహిళల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీకి రీయిం బర్స్‌మెంట్‌ చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం నుండి క్లారిటీ లేదు. గత ప్రభుత్వ మాదిరిగానే రాయితీలు ఇవ్వకుండా ఎగవేస్తాయా అన్న ఆందోళనలో ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారనడంలో సందేహం లేదు. అయితే దీనిపై స్పష్టత ఇస్తే బాగుంటుందని సిబ్బందితో పాటు ప్రజలు కూడా కోరుతు న్నారు. బస్సుల్లో మహిళల తాకిడి ఎక్కువ కావడంతో అనేక చోట్ల ప్రయాణి కులతో డైవర్లు, కండక్టర్లు కొంత ఘర్షణ పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్టీసీ సిబ్బంది కూడా సరిపోక పోవడంతో బస్టాండ్‌లలో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాలకు గురౌతున్నారు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి పక్షం రోజులు గడిచినా సంబంధిత మంత్రిత్వ శాఖ, ఉన్నత అధికారులు సమీక్షిం చలేదనే విమర్శలు వస్తున్నాయి. ఉచిత బస్సు సౌకర్యంతో ప్రయాణికులు పెరిగే అవకాశం ఉందనేది ముందుగానే ప్రభుత్వానికి తెలుసు. అయి నప్పటికీ ముందస్తు చర్యలేవీ చేపట్టకపోవడం వల్ల ప్రయాణికుల నుండి వ్యతిరేకత వస్తోంది. డిసెంబర్‌ 31, సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయా ణికుల ఇబ్బందులు మరింత పెరిగే అవకాశాలున్నాయి. దీన్ని బట్టి ఇప్ప టికైనా సంబంధిత మంత్రి, ఆర్టీసీ అధికారులతో కలిసి ప్రయాణికుల ఇబ్బం దులపై చరించాల్సిన అవసరం ఉన్నది. అలాగే ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులను కొనుగోలు చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు.
– చిలగాని జనార్థన్‌, 8121938106