మాజీ ఏసీపీ విష్ణుమూర్తిపై సస్పెన్షన్ వేటు 

నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ ఏసీపీగా గతంలో విధులు నిర్విర్తించిన విష్ణుమూర్తి పై సస్పెన్షన్ వేటుపడింది. ఈ మేరకు డీజీపీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి, అక్రమ వసూళ్ల నేపథ్యంలో ఇటీవల బదిలీపై వెళ్లిన సీపీ కల్మేశ్వర్ ఈనెల 11న ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. విచారణ అనంతరం విష్ణుమూర్తిపై వేటుపడింది. డిచ్ పల్లి ఏడో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ గా పని చేసిన విష్ణుమూర్తి ఏడాది క్రితం డిప్యూటేషన్ పై టాస్క్ ఫోర్స్ కు వచ్చారు. టాస్క్ ఫోర్స్ పై ఆరోపణల నేపథ్యంలో మాజీ సీపీ కల్మేశ్వర్ ప్రక్షాళన చేపట్టి ఇద్దరు కానిస్టేబుళ్లు రాములు, సుధాకర్ ను స్పెండ్ చేసి ఏడుగురిని బదిలీ చేశారు. ఏసీపీ విష్ణుమూర్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. నేపద్యంలో తాజాగా ఏసిపి సస్పెండ్ ఉత్తర్వులు వెలువడ్డాయి.