పొగాకు వద్దు… ఆరోగ్యమే ముద్దు : డాక్టర్‌ వంశీకృష్ణ

నవతెలంగాణ-నెల్లికుదురు
పొగాకుతో వచ్చే రోగాలు వద్దు మాకు పౌష్టికాహారంతో వచ్చేటువంటిఆరోగ్యమే ముద్దు అని స్థానిక ప్రభుత్వ వైద్యాధి కారి డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. మండల కేంద్రంలోని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగా కుతో వచ్చేటువంటి సిగరెటు, పాను, గుట్కా, అంబర్‌ డబ్బులు పెట్టి కొనుక్కొని తిని అనారోగ్యం తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని మన శరీరాన్ని మనమే పాడు చేసుకోవద్దని, పొగాకు తీసు కుంటే క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందుకని పౌష్టిక ఆహారాన్ని తీసుకొని మనమం దరం ఆరోగ్యవంతులుగా ఉండి మన జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రవి, మంగమ్మ, పీహెచ్‌ఎం మెరీనా, స్టాఫ్‌నర్స్‌, సిస్టర్స్‌, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
గార్ల : పొగాకు వాడకం ఆరోగ్యానికి హానికరం అని పొగాకు సంబంధించిన సిగరెట్లు, బీడీలు, గుట్కా, పాన్‌ లాంటివి ప్రజలు ఎవరు వాడ వద్దని ముల్కనూరు పిహెచ్‌సి వైద్య అధికా రి అవినాష్‌ కోరారు. ప్రపంచ పొగాకు దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని ముల్కనూరు గ్రామంలో పిహెచ్‌సి ఆస్పత్రి అధ్వర్యంలో బుధవారం పొగాకు వ్యతిరేక దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడం వలన అరోగ్య వంతులైన ప్రజలు జబ్బులకు గురవుతున్నారని ధూమపానం చేయడం వలన వచ్చే ఆనార్దాలను తెలుసుకుని వాడటం మానివేయాలని కోరారు. ఈ ర్యాలీలో వైద్యులు, సిబ్బం ది షాజియా, శ్రీహరి, ఇస్మాయిల్‌ బేగ్‌, రాధాకృష్ణ, పద్మ, బుజ్జమ్మ పాల్గొన్నారు.