భారత్‌లో 250 మంది ఉద్యోగులపై నోకియా వేటు

భారత్‌లో 250 మంది ఉద్యోగులపై నోకియా వేటున్యూఢిల్లీ : నోకియా కంపెనీ భారత్‌లో 250 మంది ఉద్యోగు లకు ఉద్వాసన పలకనుంది. సంస్థ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలు, పొదుపు చర్యల్లో భాగంగా సిబ్బందిపై వేటు వేయాలని నిర్ణయించింది. నోకియా 5జీ టెక్నాలజీ పట్ల భారత్‌లో డిమాండ్‌ తగ్గడంతో కంపెనీ పలు సమస్యలు ఎదుర్కొంటోందని సమాచారం. నోకియా టెక్నాలజీపై గతంలో భారీగా వెచ్చించిన కొన్ని బడా దేశీ కంపెనీలు ప్రస్తుతం దీనిపై ఇది వరకు స్థాయిలో ఖర్చు చేసేందుకు మొగ్గు చూపకపోవడంతో సిబ్బందిని తగ్గించుకోవాలని చూస్తోందని తెలుస్తోంది.