ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నామినేషన్

– ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మల విజయ్
నవ తెలంగాణ- సిద్దిపేట:అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ  వర్గీకరణ సాధ్యం కాదని కొట్టివేయడం జరిగిందనీ, అయినా బీజేపీ ప్రభుత్వం 11న ఎస్సీ వర్గీకరణ సభ నిర్వహిస్తుందనీ,  దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామని, ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో నామినేషన్ వేసినట్టు ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మల విజయ్ తెలిపారు. బుధవారం  సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కులానికి వత్తాసు పలకడం, అలాగే రాష్ట్రంలో 10 శాతం ఉన్న మాలల ఓట్లు అవసరం లేదా అని బీజేపీని ప్రశ్నించారు. మాల మహానాడుజిల్లా అధ్యక్షులు జంజీరపు ఎల్లేష్ మాట్లాడుతూ త్వరలో ఇంటింటా తిరిగి, మాల అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రచారం కూడా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.