– పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలి
– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నాగిళ్ల శ్యామ్ సుందర్
నవతెలంగాణ-మంచాల
రేపు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి పగడాల యాదయ్య నామినేషన్ కార్యక్రమం ఉన్నందున పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కా.నాగిల్ల శ్యామ్ సుందర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేపు శుక్రవారం ఉదయం 10 గంటలకు నామినేషన్ ఉంటుందని , కా,పాషా, నరహరి స్మారక కేంద్రం నుంచి ఆర్‌డీవో కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.