రూ.10 వేల నాణేలతో నామినేషన్‌

Nomination with Rs.10 thousand coins– లెక్కపెట్టడానికి ఇబ్బందిపడ్డ అధికారులు
భోపాల్‌ : న్యాయవాది సందీప్‌ నాయక్‌ జనతాదళ్‌ యునైటెడ్‌ టిక్కెట్‌పై కట్ని జిల్లా ముద్వారా అసెంబ్లీకి సిద్ధమవుతున్నారు, అయితే ఆయన నామినేషన్‌ ఫారమ్‌ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అడ్వకేట్‌ సందీప్‌ నాయక్‌ నామినేషన్‌ ఫారమ్‌ కోసం ఒక్కొ రూపాయి నాణేం చొప్పున పదివేల రూపాయల నాణేలతో మూట కట్టి తెచ్చారు. కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకున్న సందీప్‌ నామినేషన్‌ కు అవసరమైన డబ్బును మూటల్లో చిల్లర ఇవ్వటంతో అధికారులు షాక్‌ కు గురయ్యారు. ఎలాగోలా నలుగురు కలిసి గంటపాటు శ్రమించి డబ్బుల లెక్కింపు పూర్తి చేసి నామినేషన్‌ ఫారం ఇచ్చి హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు.