గాడిద, ఎడ్ల బండిపై వచ్చి నామినేషన్లు

Come on donkey and donkey cart Nominations– మధ్యప్రదేశ్‌లో స్వతంత్ర అభ్యర్థుల దరఖాస్తు
భోపాల్‌ : ఎన్నికలు వచ్చేంతవరకూ దరిదాపుల్లో కనిపించని అభ్యర్థులు కూడా చిత్ర విచిత్రమైన రీతిలో ప్రవరిస్తుంటారు. ఇలాంటి దృశ్యాలు ఎన్నికల వేళ కనిపిస్తుంటాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌లోని ఒక స్వతంత్ర అభ్యర్థి తన నామినేషన్‌ ఫారమ్‌ను దాఖలు చేయడానికి గాడిదపై కూర్చొని ఎస్‌డీఎం కార్యాలయానికి చేరుకున్నాడు. అభ్యర్థి పేరు ప్రియాంక్‌ సింగ్‌ ఠాకూర్‌ అని తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రజాధనాన్ని గాడిదలుగా మార్చాయని స్వతంత్ర అభ్యర్థి ఆరోపిస్తున్నారు. అలాగే బీజేపీపై తిరుగుబాటు చేసి నగ్డా ఖచ్రోడ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన లోకేంద్ర మెహతా తన మద్దతుదారులతో కలిసి ఎడ్ల బండిలో నామినేషన్‌ దాఖలు చేసేందుకు వచ్చారు. ఈ సమయంలో ఆయన వెంట పెద్ద ఎత్తున మద్దతుదారులు ఉన్నారు.