7న క్షత్రియ యువజన సమాజ్ నామినేషన్లు..

– ఎన్నికల అధికారి సాతు పుతే తులసీదాస్
నవతెలంగాణ- ఆర్మూర్
ఆర్మూర్ పట్టణంలో క్షత్రియ యువజన సమాజ్ ద్వైవార్షిక ఎన్నికల కోసం ఈనెల 7వ తేదీన ఉదయం 10 గటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుందని ఎన్నికల అధికారి సాత్ పుతె తులసిదాస్ అన్నారు.  పట్టణంలోని  క్షత్రియ సమాజ్ పాఠశాలలో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. నామినేషన్ల పరిశీలన 8న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా సాయంత్రం 4 గంటలకు ప్రకటిస్తామన్నారు. ఈనెల 9న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసహరణ, సాయంత్రం 4 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. ఈనెల 10న ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఎన్నికల గుర్తులను కేటాయిస్తామన్నారు. 14న ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికల పోలింగ్ ఉంటుందన్నారు. అదేరోజు సాయంత్రం 4 గంటల నుండి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించి విజేతలను ప్రకటిస్తామన్నారు. యువజన సమాజ్ ఎన్నికలలో అధ్యక్ష, కార్యదర్శుల పదవులకు ఎన్నికలు ఉంటాయన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు నమోదైన వారు పోటీ చేయడానికి, ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హత ఉంటుందన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేవారు ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ ఫోటో గుర్తింపు కార్డును తీసుకొనిరావాలని సూచించారు. పోటీలో ఉన్నవారు గోడ రాతలు, ఫ్లెక్సీలు, బ్యానర్లను చేయించరాదని, వాటిని నిషేధించామన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఎన్నికల అధికారి డమాంకర్ రవీందర్, సహాయ ఎన్నికల అధికారులు కర్తన్ కిషన్, దొండి రవీందర్, దొండి విశ్వనాథ్, ఎన్నికల సలహాదారులు కర్తన్ మధుసూదన్, బొచ్ కర్ దత్తాద్రి, సాత్ పుతే శ్రీనివాస్, సమాజ్ సభ్యుడు జెస్సు శ్రీనివాస్, యువజన సమాజ్ మాజీ అధ్యక్ష కార్యదర్శులు జీవి ప్రశాంత్, విశ్వనాథ్ శ్రీను రాజేష్ పాల్గొన్నారు.