నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ షురూ 

 నవతెలంగాణ – చండూరు:  ఈనెల 30న జరగనున్న   అసెంబ్లీ ఎన్నికల గాను నేటి నుండి  నామినేషన్ల స్వీకరణ షురూ   అయింది. ఆర్ఓ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు  మునుగోడు ఎన్నికల అధికారి, ఆర్డీవో  దామోదర్ రావు  గురువారం తెలిపారు. శుక్రవారం అభ్యర్థుల నుండి నామినేషన్లు  స్వీకరించనున్నారు. 144  సెక్షన్ అమ్ములు ఉంటుంది. నామినేషన్లు స్వీకరించే ఆర్.ఓ కార్యాలయం వద్ద  భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. భారీ కేట్లు ఏర్పాటు చేసి రాకపోకలను దారి మళ్లిస్తున్నారు. ఆర్ఓ కార్యాలయం వద్ద నుండి 100 మీటర్ల దూరం వరకు ఎవరు ఉండకుండా పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ స్వీకరించనున్నారు. ఈనెల 5 న ఆదివారం కావడంతో సెలవు ప్రకటించారు. ఆరోజు నామినేషన్ స్వీకరించబడవు. తిరిగి మరుసటి రోజు స్వీకరించబడతాయి. అభ్యర్థితో పాటు ఐదుగురు మాత్రమే లోపటికి వెళ్లాల్సి ఉంటుంది. అభ్యర్థులు నియానిబంధనలు   ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు.