– నివాళులర్పించిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య
నవతెలంగాణ-మంచాల
మండల పరిధిలోని జపాల్ గ్రామంలో సీపీఐ(ఎం) సానుభూతి పరుడు నోముల కిష్టయ్య అనారోగ్యంతో మృతిచెందినట్టు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్వర్యంలో మతిని కుటుంబాన్ని పరామర్శించి, ఆయన భౌతిక గాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు. అంత్యక్రియల్లో పార్టీ నాయకులు ఓరుగంటి భాస్కర్ గౌడ్, లింగం పల్లి ప్రభాకర్, సయ్యద్ రజాక్ పాషా, సయ్యద్ రావుఫ్ తదితరులు పాల్గొన్నారు.