
– కండ్లకు కట్టినట్లు కనిపిస్తున్న అధికారుల నిర్లక్ష్యం…
– సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలు..
నవతెలంగాణ – చివ్వేంల
మండల పరిధిలోని గుంజలూరు గ్రామంలో ఎలక్షన్ కోడ్ అమలు కావడం లేదని, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని వివిధ పార్టీలకు చెందిన పార్టీ గద్దెలకు ముసుగులు వేయకుండా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మంగళవారం గుంజలూరు గ్రామానికి పంచాయతీ కార్యదర్శి పై వస్తున్న ఆరోపణలపై జిల్లా అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదుదారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే విచారణ కు మండల స్పెషల్ అధికారి జగదీశ్వర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ కుమార్ ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎంపీవో గోపి,వెళ్లారని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని రోడ్డు పక్కనే ఉన్న పార్టీ గద్దెలకు ముసుకు వెయ్యకుండా, శిలాఫలకాన్ని సైతం ముసుకు వేయకుండా ఉన్న అధికారులు చూడకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని, అధికారుల నిర్లక్ష్యం కండ్లకు కట్టినట్లు కనిపిస్తుందని, సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యానికి జిల్లా అధికారులు, కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడాలి.