ఎమ్మార్వో ఆఫీసుల్లో పనిచేయని ప్రింటింగ్ మిషన్లు

నవతెలంగాణ –  డిండి

దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మార్వో ఆఫీసులలో ప్రింటింగ్ మిషన్లు పని చేయటం లేదని అఖిల భారత సమాఖ్య నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి యనమల నవీన్ బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. దేవరకొండ నియోజకవర్గం లో 7 మండలాలు ఉన్నప్పటికీ 6 ఎమ్మార్వో ఆఫీసుల్లో ప్రింటింగ్ మిషన్లు పనిచేయడం లేదని, రైతులు పొలాలు పట్టా చేయించుకొని పాస్బుక్ పైన ప్రింటింగ్ కోసం పొలం పాస్ బుక్ పట్టుకొని ఎమ్మార్వో  కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆయన అన్నారు. ప్రింటింగ్ మిషన్లు రిపేర్ అయి నెలలు గడుస్తున్న వాటిని పట్టించుకునే వారు లేరని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.. పై అధికారులు వెంటనే స్పందించి వాటిని బా‌గుచేయించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు.