– ఫస్ట్ పిరియడ్ కోల్పోతున్నాం, పాఠశాల విద్యార్థుల ఆవేదన
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రం నుండి బాన్స్వాడ వెళ్లే బస్సు సర్వీసులు సమయపాలన పాటించకపోవడం మేనూర్ ఆదర్శ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఉదయం పూట బస్సులు లభించక ఫస్ట్ పీరియడ్ కోల్పోతున్నట్లు ఆ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మద్నూర్ బస్టాండులో మేనూర్ ఆదర్శ పాఠశాలలో చదువుకుని విద్యార్థిని విద్యార్థులు 50 నుండి 60 మంది వరకు గంటల తరబడి బస్సు కోసం పడిగాపులు వాస్తు ఎదురు చూడగా దెగ్లూర్ నుండి బాన్సువాడకు వెళ్లే బస్సు 9 గంటల 45 నిమిషాలకు వచ్చింది. ఇక్కడి నుండి మేనూర్ వరకు వెళ్లే సరికి బస్సు 10 గంటలు దాటడం పాఠశాల లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు ఉదయం 9 గంటల 10 నిమిషాలకు చేరుకోవలసి ఉండగా, గంట ఆలస్యంగా విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు చేరుకోవడం పాఠశాల సమయంలో బస్సు సర్వీసు లేకపోవడం ప్రతిరోజు ఇబ్బందిగా మారిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సు సర్వీసులు సమయానికి రాకపోవడం ప్రతిరోజు ఫస్ట్ పీరియడ్ కోల్పోవలసి వస్తుందని మద్నూర్ బస్టాండులో ఆదర్శ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు బుధవారం నాడు నవతెలంగాణ ఎదుట వాపోయారు. ప్రతిరోజు ఉదయం ఇక్కడి నుండి బాన్సువాడ వైపు బస్సు సర్వీసులు సమయానుసారంగా లేకపోవడం చదువుకునే విద్యార్థులకు ఇబ్బందులు పడవలసి వస్తుంది. కొంతమంది విద్యార్థిని విద్యార్థులు బస్సుల కోసం పడిగాపులు కాస్తూ సమయం మీరి పోతుందని ఆటోలో వెళ్లడం జరుగుతుంది. దాదాపు 50 నుండి 60 మంది విద్యార్థులు ప్రతిరోజు మద్నూర్ నుండి మేనూర్ ఆదర్శ పాఠశాలలు చదువుకునేందుకు వెళ్తారు బస్సు సర్వీసు ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు ఇక్కడి నుండి ఉండాలని విద్యార్థిని విద్యార్థులు కోరుతున్నారు. చదువుల కోసమైనా ఆర్టీసీ అధికారులు మద్నూర్ నుండి 8:30కు బాన్సువాడ వైపు బస్సు సర్వీస్ నడపాలని విద్యార్థిని విద్యార్థులు కోరుతున్నారు. బాన్సువాడ డిపో బస్సులు దేగులూర్ వరకు నడుపుతారు అక్కడ నైట్ ఆల్బస్ ఉదయం 5 గంటలకు బాన్సువాడ వైపు వెళ్తుంది ఆ తర్వాత ఉదయం 8 గంటల వరకు బస్సులు లేవు ఉదయం 8 గంటల బస్సు వెళ్ళింది అంటే మళ్ళీ దాదాపు పది గంటల వరకు బస్సు సర్వీసులు కరువు సమయంసారంగా విద్యార్థులు చదువుల కోసం ప్రతి రోజు ఉదయం 8:30 నిమిషాలకు మద్నూరు నుండి బాన్స్వాడకు బస్సు సర్వీస్ కొనసాగించాలని విద్యార్థులు కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి విద్యార్థుల చదువుల కోసం మద్నూర్ నుండి మేనూరుకు ఉదయం పూట పాఠశాల సమయానికి బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులు సహకరించాలని విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.