తాళ్ళ రాంపూర్ లో అహింసాయుత మహాకరుణ శాఖాహార ర్యాలీ

నవతెలంగాణ-ఏర్గట్ల : మండలంలోని తాళ్ళ రాంపూర్ గ్రామంలో బుధవారం ధ్యాన బంధువులు అహింసాయుత మహా కరుణ శాఖాహార ర్యాలీని నిర్వహించారు.ఈ సందర్భంగా  ధ్యాన రత్న మిట్ట మనోహర్ మాట్లాడుతూ.. స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు జగద్గురు బ్రహ్మర్షి పితమహా సుభాష్ పత్రీజీ జన్మదిన వేడుకల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 11 రోజులు 11 మండలాల్లో జన్మదిన వేడుకలు నిర్వహించాలనుకున్నామని, ఇందులో భాగంగా ఏర్గట్ల మండలంలోని తాళ్ళ రాంపూర్ గ్రామంలో  7వ రోజు వేడుకలను నిర్వహించామని అన్నారు.కార్యక్రమంలో 300 పైగా ధ్యాన బంధువులు పాల్గొని ధ్యాన,శాఖాహార విశిష్టతను గురించి ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అడ్వకేట్ సాయి,బొడ్డు దయానంద్,పిట్ల వివేకానంద్,తదితరులు పాల్గొన్నారు.