అహింస మార్గనిర్దేశకుడు’బాపూజీ’..

The guide of non-violence 'Bapuji'..– మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి

– కాంగ్రెస్ అధ్వర్యంలో మహాత్మాగాంధీ వర్థంతి
నవతెలంగాణ – బెజ్జంకి
బ్రిటీష్ పరిపాలన నుండి విముక్తి పొంది స్వేచ్ఛాయుతా స్వాతంత్ర్య భారతదేశ సాధనకు ఉధ్యమాలు చేపట్టిన అహింస మార్గనిర్దేశకుడు మహాత్మా గాంధీయేనని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి కొనియాడారు. గురువారం మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి వర్థంతి నిర్వహించారు. మండల ఉపాధ్యక్షుడు కర్రావుల శంకర్, ఏఎంసీ వైస్ చేర్మెన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ కుమార్, అక్కరవేణి పోశయ్య, రాములు, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చైర్మన్ జెల్ల ప్రభాకర్, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, చెన్నారెడ్డి, రమేశ్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.