– మిలటరీ పరేడ్‌కు రష్యా, చైనా బృందాలు
ప్యాంగాంగ్ :శనివారం ఉత్తర కొరియా 75వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రాజధాని ప్యాంగాంగ్‌లో పేరా మిలటరీ పరేడ్ నిర్వహించారు. ట్రక్కులు, ట్రాక్టర్లలో మోసుకువచ్చిన రాకెట్ లాంచర్లను ప్రదర్శించారు. ఈ పరేడ్‌కి రష్యా కళాకారులను, చైనా ప్రతినిధులను ఉత్తరకొరియా ఆహ్వానించింది. చైనా ఉప ప్రధాని లియూ గుయోఝంగ్ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందాన్ని పంపగా, రష్యా, ఒక మిలటరీ గీతాన్ని, నృత్య బృందాన్ని పంపింది. శుభాకాంక్షలు పంపుతూ పుతిన్, జిన్‌పింగ్‌ల నుండి వచ్చిన లేఖలను కిమ్ అందుకున్నారని ప్రభుత్వ మీడియా కెసిఎన్‌ఎ తెలిపింది. ఉత్తర కొరియాతో తమ దేశాల సంబంధాలను బలోపేతం చేసుకుంటామని ఇరువురు నేతలు ఆ లేఖల్లో పేర్కొన్నారు. తద్వారా ఈ ప్రాంత శాంతి సుస్థిరతలకు దోహదపడతామని తెలిపారు. ఆయుధాల అమ్మకాలపై ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు త్వరలో ఉత్తర కొరియా నేత కిమ్ రష్యాలో పర్యటించనున్నారు.ఇదిలావుండగా, అణు శీర్షాలను మోసుకెళ్ళగల ఆయుధ వ్యవస్థలను నిర్వహించే మిలటరీ యూనిట్ల కన్నా ఈసారి పేరా మిలటరీ బలగాలు, ప్రభుత్వ భద్రతా బలగాల పాటవాలను ప్రదర్శించే విధంగా ఉత్తర కొరియా పరేడ్ నిర్వహించింది. మోటార్ సైకిళ్ళపై రెడ్ గార్డులతో ప్రదర్శనలు జరిగాయి.