– కాంగ్రెస్ నాయకులు హరిజన్ పెంటయ్య
నవతెలంగాణ-పూడూర్
దళిత బంధు కాదు ఇది బీఆర్‌ఎస్ కార్యకర్తల బంధు ఇది అని పేరు పెట్టుకోండి అని కాంగ్రెస్ మండల నాయకులు హరిజన్ పెంటయ్య అన్నారు. గురువారం పూడూరు మండల పరిధిలోని రాకంచెర్లలో విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్తున్నా తెలంగాణ ప్రభుత్వం బీఆర్‌ఎస్ నాయకులకు కార్యకర్తలకు దళిత బంధు పథకాన్ని అమలు చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పథకం వచ్చినా ప్రజలందరికీ సమానంగా చూశామని అన్నారు. దళిత బంధు ఎంపిక చేయడంలో బీఆర్‌ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా వారి కార్యకర్తలకు నాయకులను ఎంపిక చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు అర్హులైన వారికి అందే విధంగా రాజకీయాలకతీతంగా అందించామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను కులాలుగా మతాలుగా విడదీసి పరిపాలన చేస్తున్నాడని విమర్శించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన అభివద్ధి కార్యక్రమాలే కనిపిస్తున్నాయని తెలిపారు. రైతులను రుణమాఫీ పేరుతో నాలుగు సంవత్సరాలుగా మోసం చేసి ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తూతూ మంత్రంగా రైతులకు రుణమాఫీ చేశారని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పరశురాం, సొసైటీ డైరెక్టర్ రాము నాయక్, వార్డు సభ్యులు మహేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు.