నవతెలంగాణ – సిరిసిల్ల
కేటీఆర్ నీ చెల్లెలాగా మందు అమ్మి తీహార్ జైలుకు వెళ్లే మహిళలు ఎవరూ లేరని అది గుర్తుంచుకొని మహిళల పట్ల నువ్వు మాట్లాడాల్సి ఉండేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత అన్నారు. సిరిసిల్లలోని శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ నీ పార్టీ ప్రభుత్వం కోల్పోవడంతో పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నావని ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఆమె అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో కుట్లు అల్లికలు మహిళలు చేస్తున్నారని బస్సుల్లో బ్రేక్ డాన్సులు మహిళలు చేస్తున్నారని అనడం సరైనది కాదని ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని ఆమె అన్నారు. 50 శాతం మంది మహిళలు నీకు ఓట్లు వేయలేదా మహిళలంటే ఎందుకు నీకు అంత చిన్న చూపు అని ఆమె ప్రశ్నించారు .సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వెల్ముల స్వరూప ,మాజీ జిల్లా అధ్యక్షురాలు మడుపు శ్రీదేవి, ఆస్మా ,కోడం అరుణ, కోడం సుధా తదితరులు పాల్గొన్నారు.