
– మంత్రి అధేశాలను పట్టించుకోని అధికారులు
– నిర్వాసితులకు వరంగా మంత్రి అధేశాలు..శాపంగా అధికారుల వివక్ష
– పూర్తిగా పరిహారమందజేయాలని నిర్వాసితుల విజ్ఞప్తి
నవతెలంగాణ-బెజ్జంకి
మెట్టప్రాంత వరప్రదాయనిగా తోటపల్లి ఆన్ లైన్ రిజార్వాయర్ ఖ్యాతి గడించింది.రిజార్వాయర్ నిర్మాణం కోసం వ్యవసాయంపై అధారపడి జీవనం సాగించే ఎందరో రైతులు తమ భూములను త్యాగం చేశారు.రైతన్నల త్యాగాన్ని గుర్తించిన రాష్ట్ర ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు రిజార్వయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న భూములకు పూర్తిగా పరిహారమందజేయాలనే అధేశాలు వరంగా మారిన.. మంత్రి అధేశాలను పట్టించుకోకుండా పరిహారమందజేయడంలో అధికారులు వివక్ష చూపడం రైతుల త్యాగాన్ని మరువడమేనని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తమ భూములు కోల్పోయి జీవానిపాధి కరువై దౌర్భాగ్యమైన దుస్థితిని ఎదుర్కొంటున్నామని.. తమ త్యాగాన్ని గుర్తించిన మంత్రి అధేశాల ప్రకారం సంబంధిత అధికారులు ఇప్పటికైనా పూర్తిస్థాయిలో పరిహారమందజేయాలని మండల పరిధిలోని దాచారం గ్రామ శివారులోని 499,207 సర్వే నంబర్ యందు సుమారు.40 ఎకరాలు వ్యవసాయ భూములు కోల్పోయిన ముంపు నిర్వాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు..
తోటపల్లి ఆన్ లైన్ రిజార్వాయర్ యందు ముంపునకు గురవుతున్న భూముల్లో ఒక్క రైతుకు పరిహారమందజేసి మరికొందరి రైతులను విస్మరించడం..స్థానికంగా లేని వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందజేసి స్థానికంగా ఉండే నిర్వాసితులకు మొండిచెయ్యి చూపడం అధికారులు వివక్ష చూపడమేనని సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.2017 నుండి పరిహారమందజేయాలని రెవెన్యూశాఖాధిఖారుల చుట్టు నిర్వాసితులు ప్రదక్షిణలు చేస్తున్న పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు.రెవెన్యూశాఖాధికారులు ఎందరో మారిన పరిహారం అందడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు.
ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో అధికారుల వివక్ష..
రిజార్వయర్ నిర్మాణంలో తమ వ్యవసాయ సాగు భూములు ముంపునకు గురవ్వడంతో సర్వస్వం కోల్పోయాం.స్థానికంగా లేని వారికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందజేసి స్థానికంగా ఉన్న వారిని అధికారులు విస్మరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిహారమందజేయాలని సూచించిన అధికారులు నిర్లక్యంగా వ్యవహరించడం వల్ల పరిహరమందడం లేదు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిర్లక్ష్యాన్ని వీడీ పరిహారమందజేసేల ప్రత్యేక చోరవ తీసుకోవాలి.
-బురుగుల లక్ష్మి,నిర్వాసితురాలు దాచారం.
అధికారుల నిర్లక్ష్యమే నిర్వాసితులకు శాపం
తోటపల్లి ఆన్ లైన్ రిజార్వాయర్ యందు ముంపునకు గురై భూములు కోల్పోతున్న రైతులకు పూర్తిగా పరిహారమందజేయాలని మంత్రి తన్నీరు హరీశ్ రావు అధేశాలిచ్చారు.గత 6 ఎండ్లుగా సంబంధిత అధికారులే దాటవేసే దోరణి అవలంభిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిర్వాసితులకు శాపంగా మారింది.ప్రభుత్వం నిర్వాసితులకు పరిహారమందజేయాలనే కృత నిశ్చయాన్ని అధికారులు నీరుగార్చుతున్నారు.మరోసారి పరిహార సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లడానికి కృషి చేస్తాను.
