నవదీప్ సరికొత్తగా కనిపించబోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. దీనికి దర్శకుడు రాజమౌళి శిష్యుడు అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో కలిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల సింగిల్ కట్ లేకుండా సెన్సార్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ‘ఏ’ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 7న విడుదలకు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు అవనీంద్ర మీడియాతో సంభాషించారు. ఇటీవల వైజాగ్‌లో ప్రత్యేక షో వేశాం. ఈ షోకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. విడుదలకు మూడు రోజుల ముందే ప్రివ్యూ వేయడం రిస్క్ అనిపించలేదు. బుకింగ్ ఓపెన్ చేయగానే, వెంటనే అయిపోయాయి. అప్పుడర్థమైంది జనాలు కూడా సినిమా చూడడానికి ఆసక్తిగా ఉన్నారని. నేను ఊహించని చోట కూడా వారు ఎంగేజ్ అయి ఎంజారు చేయడం చూసి చాలా హ్యాపీగా అనిపించింది. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ కథలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కొంతమంది లొకేషన్స్, కొంతమంది హీరోయిన్ క్యారెక్టరైజేషన్.. ఇలా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా అమ్మాయిలు బాగా కనెక్ట్ అయ్యారు.
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో నవదీప్ పాత్రకి ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతారు. యదార్థ సంఘటనల నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రమిది. రిలేషన్‌లో ఒక జంట రెండు సంవత్సరాలు హ్యాపీగా ఉన్న తర్వాత.. వారిద్దరి మధ్య ఎందుకు అంత ప్రేమ ఉండటం లేదు. ఎందుకు ఆ రిలేషన్ బ్రేక్ అవుతుంది అన్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది. ఈ పాయింట్ అందరికీ నచ్చుతుందని లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కించాను. ఈ చిత్రంలో 42 లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఉన్నాయి. అయితే అవన్నీ కావాలని పెట్టినవి కాదు. కథకు అవసరమై పెట్టినవే. ఇంకా చెప్పాలంటే లస్ట్ కోసం కోసం చేసిన సినిమా కాదు లవ్ కోసం చేసిన సినిమా ఇది. నా దష్టిలో ప్రేమంటే నాకు నచ్చినట్టు ఉండమనడం కాదు.. నాకు నచ్చకపోయినా.. నిన్ను నీలా ఉండనీయడం ప్రేమ. అదే ఇందులో చెప్పదలచుకున్నాను ఈ సినిమాకి నేపథ్యం సంగీతం చాలా ముఖ్యం. తమిళ్‌లో ’96’ అనే సినిమా వచ్చింది. అందుకే ఆ సినిమా సంగీత దర్శకుడు గోవింద్ వసంత్ తీసుకున్నాం. టెర్రిఫిక్‌గా మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా చూసిన తర్వాత పాటలు ఎక్కువగా పాడుకుంటారు.