– ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్
నవతెలంగాణ-కోడంగల్
కోడంగల్ మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసింది. శుక్రవారం ఎంపీపీ ముదప్ప దేశ్ముఖ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని తమ ప్రగతిని వివరించారు. అనంతరం ఎంపీపీ పదవి త్వరలో ముగియనుండటంతో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు శాలువా, పూలమాలతో ఘనంగా ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచులు, వివిధ శాఖల అధికారులు మాట్లాడుతూ ప్రజాసేవలో ఉండే ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు పదవి విరమణ అనేది తాత్కాలిక విరామం మాత్రమే అని ప్రజాసేవ నిరంతర ప్రక్రియ అన్నారు. మండలంలోని గ్రామాల అభివద్ధిలో ఎంపీపీ పాత్ర ఎంతో కీలకమైంది అన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ మాట్లాడుతూ ఐదేండ్లుగా సహకరించిన ప్రజలకు. సర్పంచులకు. ఎంపీటీసీలకు. అధికారులకు రుణపడి ఉంటానని అన్నారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా అన్నారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ విజయకుమార్. కాంగ్రెస్ మండల అధ్యక్షులు నందారం ప్రశాంత్, ఎంపీడీవో ఉషశ్రీ, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓ రాములు, మాజీ సర్పంచులు వెంకట్‌రెడ్డి, సయ్యద్ అంజాద్, పకీరప్ప, శంకర్ నాయక్, సాయిలు, నాయకులు గోడల రాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.