– ఋణమాఫీ కాలేదని వచ్చిన దరఖాస్తులలో అత్యధిక రేషన్ కార్డుకు సంబంధించిన వే..
నవతెలంగాణ – అశ్వారావుపేట
సన్న చిన్నకారు రైతులకు రేషన్ కార్డు లేకపోవడంతో శాపంగా మారింది.తెలంగాణ ప్రభుత్వం ఋణ మాఫీ చేసినప్పటికీ అర్హతలు ఉన్నా రేషన్ కార్డు లేకపోవడంతో లబ్ధిదారులు జాబితాలో పలువురు రైతులకు స్థానం దక్కలేదు. గత మూడు రోజులుగా స్వీకరించిన పిర్యాదు ల్లో అత్యధికం ఈ రేషన్ కార్డ్ సమస్యే ప్రధానంగా కనిపిస్తుంది.జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ విడుదల చేసిన వివరాలు ప్రకారం నియోజక వర్గంలో వివరాలు. మొత్తం 10 అంశాల పై ఋణం మాఫీ పై రైతులు దరఖాస్తులు స్వీకరించారు.ఇందులో అయిదు మండలాలు నుండి మొత్తం 1704 దరఖాస్తులు రాగా అందులో కుటుంబ సభ్యులు గుర్తించే రేషన్ కార్డ్ పై 818,రెండు లక్షలు పై అప్పు ఉన్న వారి నుండి 403,పట్టాదారు పాస్ బుక్ లేనివి 267,అసలు ఏ వివరాలు లేని వారివి 74,నేమ్ మిస్ మ్యాచ్ ఉన్నవి 68,ఆధార్ లింక్ కానివి 41,బ్యాంక్ సంబంధిత 15,పీఏసీఎస్ సంబంధించినవి 7,డీబీటీ ఫెయిల్యూర్ అయినవి 6,ఇతరాలు 5 మొత్తం 1704 దరఖాస్తులు వచ్చాయి.