– పలు నియోజకవర్గాల్లో హస్తం ఢీ అంటే ఢీ
– దక్షిణ తెలంగాణ అంతటా కాంగ్రెస్ గాలి
– బీఆర్‌ఎస్ అగ్రనేతలతో భేటీలో పీకే
– అప్రమత్తమైన గులాబీ దళం
– ఈ వారం రోజులూ పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని బీఆర్‌ఎస్ బాస్ ఆదేశం
– అదే పనిలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మెన్లు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మరో వారం రోజులే గడువున్న నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్ అగ్రనేతలు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)తో ప్రత్యేకంగా భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం… పార్టీ పరంగా చేయించిన సర్వేలు, ఇంటిలిజెన్స్ వర్గాలు అందించిన నివేదికల ఆధారంగా గులాబీ పార్టీకి ‘ప్రమాద ఘంటికలు’ మోగుతున్నాయనే ఆందోళనల నేపథ్యంలోనే ఈ రహస్య, అంతర్గత సమావేశాన్ని నిర్వహించినట్టు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల ఎన్నికల సమయంలో పీకే ఇచ్చిన సూచనలు, సలహాలు పని చేయటంతో ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చినట్టు కథనాలు వెలువడిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఇప్పుడు ఎదురు కాబోతున్న ‘సంక్లిష్ట పరిస్థితుల’పై చర్చించేందుకే కారు పార్టీ నేతలు ఆయనతో భేటీ అయినట్టు సమాచారం.
ఈ సమావేశం సందర్భంగా పీకే పలు విషయాలను సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ‘హస్తం’ గాలి బాగా వీస్తోన్నట్టు ఆయన చెప్పారు. దాంతోపాటు వరంగల్‌లో సగం సీట్లు, రంగారెడ్డిలో అత్యధిక సీట్లలో కాంగ్రెస్ హవా కొనసాగనుందని ఆయన విశ్లేషించారు. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మాత్రమే కారు రయ్యున దూసుకుపోనుందనీ, ఉమ్మడి మెదక్‌తోపాటు కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, మిశ్రమ ఫలితాలను సాధిస్తాయంటూ పీకే విశదీకరించినట్టు తెలిసింది. ఈ క్రమంలో గులాబీ పార్టీకి ఈసారి గెలుపు ‘అంత ఈజీ కాదం’టూ ఆయన స్పష్టీకరించినట్టు సమాచారం. అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్న మౌత్ టాక్ అనూహ్యంగా ఊపందుకుందన్న విషయాన్ని ఆయన కేసీఆర్ దృష్టికి తీసుకుపోయారు. అందువల్ల ఆ పార్టీ అత్యధిక స్థానాల్లో బీఆర్‌ఎస్‌తో ఢ అంటే ఢ అంటోందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కొద్ది రోజుల సమయాన్ని వినియోగించుకుని, వ్యూహాత్మకంగా వ్యవహరించాలంటూ బీఆర్‌ఎస్ అధిష్టానానికి ఆయన సూచించారు. ఈ సందర్భంగా తనకున్న అనుభవంతో పలు సూచనలు, సలహాలను ఆయన వారికిచ్చినట్టు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిస్థితుల దృష్ట్యా పీకేతో భేటీ అనంతరం… సీఎం కేసీఆర్ జిల్లాలు, నియోజకవర్గాల్లోని నేతలకు దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా అభ్యర్థులుగా ఉన్న
ఎమ్మెల్యేలు కాకుండా మిగతా ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మెన్లు, జిల్లాల అధ్యక్షులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రధాన బాధ్యులందరూ ఈనెల 30 దాకా నియోజకవర్గాలు వీడి బయటకు రావద్దంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. కులాలు, వర్గాలు, తరగతుల వారీగా ఓటర్లను కలుస్తూ, ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు నిర్వహించాలని సూచించారు. తద్వారా ఏ ఒక్క ఓటరు ‘చే’జారి పోకుండా చూసుకోవాలని కోరారు. ముఖ్యంగా ‘తటస్థ’ ఓటర్లపై దృష్టి