
ప్రముఖ చిత్రకారుడు బాపు నేషనల్ అవార్డు గ్రహీత దాసి సుదర్శన్ సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. మిర్యాలగూడలో ప్రముఖ ఆర్టిస్ట్ గా, సాహితీవేత్తగా సురపరిచితులైన సుదర్శన్ నాగార్జునసాగర్ జూనియర్ కాలేజ్ లో డ్రాయింగ్ మాస్టర్ గా పనిచేస్తూ, ఎంతోమంది విద్యార్థులను కళల వైపు, సాహిత్యం వైపు మళ్లించి నిష్ణాతులను చేశారు. ఆర్టిస్టుగా, సాహితీవేత్తగానే కాకుండా ఆయన జర్నలిస్టుగా కూడా వివిధ పత్రిక ల్లో వ్యాసాలు, వార్తలు రాస్తూ ప్రజ్ఞ పాటవాలను నిరంతరం ప్రకటిస్తుండేవారు. సు సుదర్శన్ ఆయన విదయ వివిధ ప్రజ్ఞ పాటలతో సినిమా రంగాన్ని కూడా ఆయన సులపరిచితులే. ప్రముఖ దర్శకులు కళాకారులు బి. నర్సింగరావు తీసిన అనేక సినిమాలకు ఆయన కళాదర్శకుడిగా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. నర్సింగరావు తీసిన దాసి సినిమాకు అందుకున్న ఐదు జాతీయ అవార్డులలో సుదర్శన్ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత జాతి అవార్డులు జూరీలు ఆయన సభ్యులుగా నియమితులయ్యారు. ఇలా అనేక రంగాలలో ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన సుదర్శన్ తన 72 ఏటా తను చాలించారు. ఆయన అభిమానులకు శిష్యులకి మిగతా సాయిచి మిత్రులందరికీ తట్టుకోలేనితన సేవల్ని అందించారు. ఆయన గురుత్వంలో అనేకమంది శిష్యులు గా తయారయ్యి ప్రశంసలు అందుకుంటున్నారు.ఆయన మరణ వార్తను తెలుసుకున్న అభిమానులు,మిత్రులు,బంధువులు శోకసంద్రంలో మునిగారు.