ఎంపీ రాములు వల్ల ఒరిగింది ఏమీ లేదు.!

– ఏ పార్టీలో ఉన్న ప్రజలకు ఆయన చేసింది శూన్యం

నవతెలంగాణ – అచ్చంపేట 
ప్రజల ప్రయోజనాల కోసం ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి పని చేయవలసిన రాజకీయ నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన కుటుంబ సభ్యుల కోసం ఓటర్లను అదులుగా వాడుకొని స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలను మారుతున్నారు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ ఎంపీపీ రాములు వివిధ పార్టీలలో అవకాశం కల్పిస్తే పదవులను ఆశించారు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం అరడ పడ్డారు. ఈనాడు ఓటేసిన ఓటర్ల గురించి కానీ  పార్టీ జెండా జెండా మోసిన కార్యకర్తల కోసం ఏనాడు ఎంపీ రాములు పని చయలేదని పట్టణంలో చర్చ బలంగా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యేగా అచ్చంపేట ప్రజలు అవకాశం కల్పించారు మళ్లీ తెలంగాణ రాష్ట్రం అనుగ్రహం తర్వాత 2019లో నాగర్కర్నూల్ పార్లమెంటు సభ్యులుగా గెలుపొందారు. ప్రజలు ఇచ్న అధికారాన్ని ఏనాడు ప్రజల కోసం ఉపయోగించలేదనీ చర్చ జరుగుతుంది. మళ్లీ ఇప్పుడు తన కొడుకు కోసం వ్యక్తిగత స్వలాభం కోసం ఓటర్లను పార్టీ కార్యకర్తలను మోసం చేసి బిజెపి చేరారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం లో అత్యధికంగా మాదిగల ఓట్లు ఉన్నాయి దీని ఆసరా చేసుకుని ఏ పార్టీలో ఉన్న మాదిగలు నన్ను గెలిపిస్తారు అనే ధీమాతో ఈరోజు రాములు బిజెపి పార్టీలో చేరారు అనేది చర్చ జరుగుతుంది. కానీ వాస్తవానికి నాగర్ కర్నూల్ జిల్లాలో బిజెపి పార్టీ అంత ప్రభావం ఉండదనేది ప్రజల విశ్వాసం. తెలుగుదేశం పార్టీ, భారత రాష్ట్ర సమితి పార్టీ , కార్యకర్తలు ఎంపీ రాములు ప్రవర్తన పైన పలు రకాలుగా చర్చించుకుంటున్నారు మళ్ళీ బిజెపి పార్టీ కార్యకర్తలు కూడా ఆయన రావడం పట్ల అసలు చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది.