నవతెలంగాణ-హైదరాబాద్ : లండన్ యందు నెలకొని ఉన్న టెక్నాలజీ కంపెనీ ‘నథింగ్’ నేడు తన అత్యాధునిక కమ్యూనిటీ త్రైమాసిక అప్‌డేట్ వీడియోలో తాను మార్చ్ 4 వ తేదీన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఫోన్ (3a) సీరీస్ ని విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది. రాబోయే ప్రారంభ ఆవిష్కరణ గురించి తెలియజేయాలని ఆసక్తి ఉన్నవారు Flipkart పై సైన్-అప్ చేయవచ్చు. అప్‌డేట్ సందర్భంగా, ‘నథింగ్’ యొక్క సహ-వ్యవస్థాపకులు అకిస్ ఎవాంజిలిడిస్ ఇలా అన్నారు: “(a) సీరీస్ కోసం మేము విభిన్నమైన వాడుకదారుల కూర్పును కలిగి ఉన్నాము. ప్రజలు స్మార్ట్‌ఫోన్ ని కొనుగోలు చేసేటప్పుడు, కొందరు గొప్ప ఆకాంక్షలతో ఉంటారు, వారు అత్యాధునిక ఆవిష్కరణలు మరియు ప్రాసెసర్లను కోరుకుంటారు. అయినా, టెక్నాలజీ గురించి అంతే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న మరికొందరు వాడుకదారులు కేవలం గొప్ప వాడుకదారు అనుభవంతో సంతోషపడతారు – ఈ (a) సిరీస్ అటువంటి వారి కోసమే. కెమెరా, స్క్రీన్, ప్రాసెసర్ మరియు డిజైన్ విషయంగా మేము నిజంగా వాడుకదారుల ముఖ్య అవసరాలపై దృష్టి సారించాము.” అదనంగా, అక్టోబర్ 2020 లో, అనగా కేవలం నాలుగు సంవత్సరాల క్రితం స్థాపించబడినప్పటి నుండీ కంపెనీ తన జీవితకాల రాబడిలో $1 బిలియన్ ని అధిగమించిందని అప్‌డేట్ యందు ‘నథింగ్’ వెల్లడించింది. ‘నథింగ్’ యొక్క ముఖ్య ఫైనాన్షియల్ అధికారి, టిమ్ హోల్‌బ్రో ఇలా జోడించారు: “ఆ రాబడిలో సగానికి పైగా కేవలం గత 2024 సంవత్సరంలోనే వచ్చింది. మరి అత్యంత సంతోషదాయకమైన విషయమేమిటంటే, మేము ఖచ్చితంగా చేయాలనుకున్నదే చేశాము. ఫోన్ (2) మరియు ఇయర్ (2) విజయాలపై ఫోన్ (2a), ఫోన్ (2a) ప్లస్ మరియు CMF ఫోన్ 1 లతో నిర్మించాలని లక్ష్యంగా చేసుకొని మేము 2024 సంవత్సరం లోనికి అడుగు పెట్టాము. మేము ఆ ఉత్పాదనల్ని మార్కెట్ లోనికి తీసుకువచ్చాము మరి మా బిజినెస్ వ్యాప్తంగా స్థాయి పెంపుదలను ప్రారంభించాము. అది సహజంగానే మాకు అద్భుతమైన అగ్రస్థాయి రాబడి వృద్ధిని అందిస్తుంది. దానిని సాధించడం పట్ల మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది మరియు 2025 లో మేము ఏమి సాధించగలమో చూసేందుకు మేము ఉత్సుకతతో ఉన్నాము. ”