అబార్షన్ కిట్లు విక్రయించినందుకు దుకాణాలకు నోటీసు జారి

నవతెలంగాణ – రామారెడ్డి
అబార్షన్ కిట్లు, అన్ వాంటెడ్ కిట్లు, నిషేధిత ఔషధ మాత్రలు విక్రయించారని మండలంలోని రెడ్డి పేటలో బాలాజీ, లక్ష్మీ నరసింహ మెడికల్ షాపులకు గత మంగళవారం డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రాజిరెడ్డి మెడికల్ షాపులు తనిఖీ చేసి నోటీసులు జారీ చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రజల ప్రాణాలతో, చట్ట వ్యతిరేక ఔషధాలను విక్రయిస్తున్న, చర్య తీసుకోవలసిన అధికారులు, సమాజానికి, మీడియాకు తెలియకుండానే గుట్టు చప్పుడు కాకుండా నోటీసులు ఇవ్వడం ఏంటని, అంతర్గతంగా ఏమి జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడికల్ షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.