మాజీ సీఎస్‌ సోమేశ్‌కు త్వరలోనే నోటీసులు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో సంచలనం రేపుతూ వెలుగు చూసిన మరో స్కాం కమర్షియల్‌ ట్యాక్స్‌లో రూ.1400 కోట్లకు పైగా సబ్సిడీ కేసులో రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు నోటీసులు ఇవ్వటానికి సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కమర్షియల్‌ ట్యాక్స్‌లో అక్రమంగా కోట్లాది రూపాయల సబ్సిడీ చెల్లించారంటూ అందులోని అధికారుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట నేరపరిశోధన శాఖలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇందులో కేసు నమోదు చేసిన అనంతరం దర్యాప్తు బాధ్యతలను తర్వాత సీఐడీకి ప్రభుత్వం అప్పగించింది.