ఆక్వా మెరైన్‌ కేసులో నోటీసులు

నవతెలంగాణ-హైదరాబాద్‌
కొత్వాల్‌గూడలోని ఆక్వా మెరైన్‌ పార్క్‌ను ఏర్పాటును సవాల్‌ చేస్తూ దాఖలైన కేసులో హైకోర్టు ప్రతివాదులైన మున్సిపల్‌, పశు సంవర్ధక, మత్స్యశాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్‌ఎండీఏ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఆగస్టు నాలుగో తేదీకి వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ అధ్యయనం చేయకుండా అక్వా మెరైన్‌ పార్క్‌ ఏర్పాటు వల్ల తీవ్ర సమస్యలు తలెత్తుతాయంటూ సినిమా యాక్టర్లు శ్రీదివ్య, రేణుదేశారు ఇతరులు పిల్‌ దాఖలు చేశారు. వారి తరఫు న్యాయవాది వాదిస్తూ, పర్యావరణ అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తే జలసంపదకు వాటిలోని చరాలకు, వన్యప్రాణులకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందని చెప్పారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఏర్పాటు చేస్తే తప్పేముందని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. విచారణను ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసింది.