సేవాలాల్ కమిటీ సభ్యులకు పోలసుల నోటిసులు

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలో గల సర్వే నెంబర్ 728/20 భూమి విషయం హైకోర్టు కేసు పెండింగ్ లో ఉన్నందున గతంలో సేవాలల్ కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ సారి సేవాలల్ జయంతి సందర్భంగా ఏటువంటి అల్లర్లు, ప్రశాంతతకు భంగం కలిగించే చర్యలు జరగకుడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా ఉన్నతాధికారుల ఆదేశానుసారం నోటీసులను అందజేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, ఇంచార్జీ ఎస్సై మనోజ్ కుమార్ లు వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే సేవాలల్ కమిటీ సభ్యులకు ఆదివారం డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, ఇంచార్జీ ఎస్సై మనోజ్ కుమార్ లు నోటీసులను ఇందల్ వాయి పోలిస్ స్టేషన్ లో అందజేశారు. వచ్చే రోజుల్లో సేవాలల్ జయంతి  సందర్భంగా ఏటువంటి అల్లర్లు, జరగవద్దని, ప్రజలకు భంగం కలిగించే చర్యలు జరగకూడదనే ఉద్దేశంలో ముందు జాగ్రత్త చర్యగా పై అధికారుల అదేశానుసారం నోటీసులిస్తున్నామన్నారు.