– అభిషేక్ బెయిల్ పిటిషన్ పై
– మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలి
సుప్రీంకోర్టు ఆదేశం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడిగా దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తోన్న అభిషేక్ బోయినపల్లి బెయిల్ పై విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 20కి వాయిదా వేసింది. అలాగే అభిషేక్ బెయిల్ పిటిషన్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కి నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణం వ్యవహారంలో స్పెషల్ కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ… అభిషేక్ బోయినపల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. దీనిపై ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం… ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై మూడు వారాల్లో ఈడి సమాధానం కోరింది. ఈ సమాధానంపై రిజాయిండర్ దాఖలకు చేసేందుకు అభిషేక్ బోయినపల్లి కి మరో రెండు వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 20 వాయిదా వేసింది.