నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్టేషన్ ఘన్‌పూర్, భద్రాచలం ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావులపై అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు ఇవ్వాలనే కేసులో హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ విజయసేనరెడ్డి విచారించారు. ప్రతివాదులైన కడియం, తెల్లం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ, శాసనసభ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘాలకు నోటీసులు ఇచ్చింది. విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది. వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ చేసేందుకు వెళితే అసెంబ్లీలోకి అనుమతివ్వలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు చెప్పినట్టుగా ప్రభుత్వ ప్లీడర్ ద్వారా ఫిర్యాదులను స్పీకర్ ఆఫీసుకు అందజే శామని ఏజీ చెప్పారు. దీంతో హైకోర్టు ప్రతివాదులకు నోటీసులిచ్చింది.