
– 12 71 లొకేషన్ లలో 17 66 పోలింగ్ కేంద్రాలు
– 100 మీటర్ల లోపు ఐదుగురికి మాత్రమే అనుమతి
– దివ్యాంగులకు, వయోవృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
– నేటి వరకు 41.22 కోట్ల నగదు, మద్యం, ఆభరణాలు స్వాధీనం
– ఓటు హక్కును 12 రకాల గుర్తింపు కార్డులతో ఉపయోగించుకోవచ్చు
– జిల్లా ఎన్నికల అధికారి అర్వి.కర్ణన్
నవతెలంగాణ- నల్గొండ కలెక్టరేట్
శాసనసభ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు సజావుగా సాగేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, పోటీ చేయు అభ్యర్థులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అర్.వి.కర్ణన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఎస్.పి.అపూర్వ రావు తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లు,నామినేషన్ స్వీకరణ ఏర్పాట్ల పై వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ కొరకు జిల్లాలోని 86 -దేవరకొండ (ఎస్.టి.) నియోజకవర్గం లో 308, 003-బెల్లంపల్లి (ఎస్.సి.),87- నాగార్జున సాగర్ నియోజకవర్గం లో 299, 88- మిర్యాలగూడ నియోజక వర్గం లో 263,
92- నల్గొండ నియోజకవర్గం లో 284, 93-మును గోడ్ నియోజకవర్గంలో 307, 95 -నకిరేకల్ (ఎస్.సి.) నియోజకవర్గం లో 305, మొత్తంగా 1766 పోలింగ్ కేంద్రాలు 1271 లొకేషన్ లలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.జిల్లాలో ప్రతి నియోజకవర్గం లో 5 చొప్పున ఆరు నియోజకవర్గాల్లో 30 మహిళలు నిర్వహించే పోలింగ్ స్టేషన్ లు,30 మోడల్ పోలింగ్ స్టేషన్ లు, ప్రతి నియోజకవర్గం లో ఒక ది వ్యాంగులు నిర్వహించే పోలింగ్ స్టేషన్ మొత్తం 6,యువత నిర్వహించే ఆరు పోలింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదల,నామినేషన్ లు స్వీకరణ, 10వ తేదీ నామినేషన్ సమర్పించేందుకు ఆఖరు తేది అని, 13న నామినేషన్ల పరిశీలన, 15 వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరణ, 30వ తేదీన పోలింగ్, డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ జరుగుతాయని, ఎన్నికల నిబంధనలు డిసెంబర్ 5వ తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు.నవంబర్ 30 న పోలింగ్ ఆరు నియోజక వర్గాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.కౌంటింగ్ డిసెంబర్ 3 న ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రతి రోజు ఉదయం 11 గం.ల నుండి మధ్యాహ్నం 3 గం.ల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, నామినేషన్ స్వీకరించే సమయంలో సి.సి. కెమెరాతో పాటు వీడియో చిత్రీకరణ ద్వారా రికార్డు చేయడం జరుగుతుందని, నిర్ణీత సమయంలోగా నామినేషన్లు దాఖలు చేయాలని తెలిపారు. 86-దేవరకొండ(ఎస్.టి.) నియోజకవర్గ పరిధిలోని దేవరకొండ అర్డిఓ కార్యాలయంలో, 87-నాగార్జున సాగర్ నియోజకవర్గం పరిధిలోని నిడమానూరు తహశీల్దార్ కార్యాలయం లో, 88 – మిర్యాల గూడ నియోజక వర్గ పరిధి లో అర్డిఓ మిర్యాలగూడ కార్యాలయం లో,92- నల్గొండ నియోజక వర్గ పరిధి లో నల్గొండ అర్డిఓ కార్యాలయం లో ,93- మును గోడ్ నియోజక వర్గానికి సంబందించి చండూర్ తహశీల్దార్ కార్యాలయం లో,95- నకిరేకల్(ఎస్.సి) నియోజక వర్గానికి సంబందించి మార్కెట్ కమిటీ తహశీల్దార్ కార్యాలయంలో, నామినేషన్లు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ దాఖలు చేయు సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల వ్యాసార్థం లోపు నామినేషన్ దాఖలు అభ్యర్థితో కలిపి 5 గురికి మాత్రమే అనుమతి ఉంటుందని, మొత్తం 3 వాహనాలను అనుమతించడం జరుగుతుందని తెలిపారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలు లో ఉంటుందని తెలిపారు.నామినేషన్ లు ఆన్ లైన్ లో ఎన్ కోర్ ఆప్ లో, లేదా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆప్ లైన్ లో దాఖలు చేయవచ్చని తెలిపారు.అభ్యర్థులు అఫిడవిట్ లు ఆన్ని కాలమ్ లు పూర్తి చేయాలని అన్నారు.గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులను ప్రతి పాదిస్తున్న ఒక ప్రతి పాదకులు పోటీ చేస్తున్న అభ్యర్థి నియోజ వర్గం లో ఓటర్ గా నమోదై ఉండాలని,రిజిస్టర్డ్ అయి గుర్తింపు లేని రాజకీయ పార్టీ లు,ఇండిపెండెంట్ అభ్యర్థులను ప్రతి పాదన చేస్తున్న 10 మంది ప్రతి పాదకులు అభ్యర్థి పోటీ చేస్తున్న నియోజక వర్గం కు చెందిన ఓటర్ గా నమోదై ఉండాలని అన్నారు.కేంద్ర ఎన్నికల సంఘం 3 గురు ఎన్నికల వ్యయ పరిశీలకులు నియమించినట్లు తెలిపారు. నామినేషన్లను ఉపసంహరించుకునే అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేయు అభ్యర్థులు ఎన్నికల సంబంధిత ఖర్చుల నిర్వహణ కొరకు నామినేషన్ దాఖలు చేయడానికి ముందుగానే ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరువాలని, వివరాలు నామినేషన్లో నమోదు చేయాలని, ప్రతి చెల్లింపు లావాదేవీలను ఖాతా ద్వారా మాత్రమే చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం శాసనసభ అభ్యర్థి అత్యధికంగా 40 లక్షల రూపాయలు వరకు ఖర్చు చేయవచ్చని, అంతకు మించి చేయరాదని, ఎన్నికల ప్రచారం సందర్భంగా సభలు, సమావేశాలకు వినియోగించే సామాగ్రి, ప్రచారం కొరకు ఉపయోగించే కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్స్, స్పీకర్లు, ప్రకటనలు, సోషల్ మీడియాతో కలిపి ఇతరత్రా అన్ని రకాల ప్రచార సాధనాలకు రేట్ చార్ట్ రూపొందించడం జరిగిందని, ఎన్నికల ఖర్చుల పరిశీలకులు ఈ రేట్చార్ట్ ప్రకారం లెక్కించడం జరుగుతుందని తెలిపారు. కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలపై ముద్రించే వారు, ఏజెన్సీ వివరాలు ఖచ్చితంగా ముద్రించాలని, లేని పక్షంలో ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ రోజు ఓటర్ లు ఓటు వేయడానికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డ్ కలిగి ఉండాలని, ఒక వేళ ఫోటో గుర్తింపు కార్డ్ లేని యెడల ఓటు హక్కును ప్రభుత్వంచే జారీ చేయబడిన 12 రకాల గుర్తింపు కార్డుల ద్వారా ఉపయోగించుకోవచ్చని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లయితే సి-విజిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతి కొరకు సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ ఛానళ్ళలో,సోషల్ మీడియా లో ప్రకటనల ప్రదర్శన కొరకు జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. దివ్యాంగులకు, 80 సం.ల పైబడిన వయోవృద్ధులకు, ఎన్నికల విధులలో ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు.జిల్లాలో ఇప్పటి వరకు పోలీస్, ఎఫ్.ఎస్.టి.బృందాల ద్వారా41 కోట్ల 22 లక్షల 31 వేల 431 రూ.లు విలువ గల నగదు,మద్యం,డ్రగ్స్ ,ఆభరణాలు,వస్తువులు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు.జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా దరఖాస్తు చేసుకున్న నగదు,వస్తువులు స్వాధీనం పై కమిటీ పరిశీలించి 24 గంటల్లో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశం లో సిపిఐ (ఎం) నుంచి నర్సి రెడ్డి, ఏఎ ఐఎం. కు చెందిన
మెయిన్, టి డిపి నుంచి మల్లికార్జున్, బిఅర్ఎస్ నుంచి పిచ్చయ్య,బిజెపి నుండి లింగ స్వామి,భూ సేకరణ స్పెషల్ కలెక్టర్ హరి సింగ్,ఎన్నికల డి. టి.విజయ్, తదితరులు పాల్గొన్నారు.