నవంబర్ 4 నియోజక వర్గ స్థాయి అత్యవసర సమావేశం -కన్వీనర్ పుల్లయ్య

నవతెలంగాణ – అశ్వారావుపేట:
అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలోని సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు, శాఖా కార్యదర్శుల విస్తృత సమావేశం నవంబర్ 4 (శనివారం) ఉదయం 10 గంటలకు స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించబడుతుంది అని కన్వీనర్ కొక్కెరపాటి పుల్లయ్య గురువారం తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పాల్గొంటారు అని అన్నారు. ఎన్నికల సమయం అయినందున, నామినేషన్ లు గడువు ప్రారంభం కావడంతో సమయాభావం నేపధ్యంలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరు కావాల్సిన సభ్యులంతా తప్పక హాజరయ్యేలా పార్టీ మండల కార్యదర్శులు ప్రత్యేక చొరవ తీసుకొని అంతా హాజరయ్యేలా చూడాలని కోరారు.