న్యూఢిల్లీ: 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించే భారత షార్ట్ట్ గన్ జట్టు బృందాన్ని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఎఐ) ప్రకటించింది. ఎన్ఆర్ఎఐ మంగళవారం ప్రకటించిన పురుషుల షార్ట్‌గన్ బృందానికి పృథ్విరాజ్ థొండిమాన్, మహిళల బృందానికి రాజేశ్వరి కుమారి సారథ్యం వహించనున్నారు. పురుషుల, మహిళల బృందం మొత్తం ఐదు విభాగాల్లో పతకాలకు పోటీపడనున్నారు. పురుషుల స్కీట్‌లో అమన్‌జీత్, మహిళల స్కీట్ విభాగాల్లో రిజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ పతకాలకు పోటీపడనున్నారు. ఇక మహేశ్వరి, అమన్‌జీత్ బృందం స్కీట్ మిక్స్డ్ టీం విభాగంలో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
పురుషుల ట్రాప్ : పృథ్విరాజ్ థొండిమాన్
మహిళల ట్రాప్ : రాజేశ్వరి కుమారి
పురుషుల స్కీట్ : అమన్‌జీత్ సింగ్
మహిళల స్కీట్ : రిజా ధిల్లాన్,
మహేశ్వరి చౌహాన్
స్కీట్ మిక్స్డ్ టీమ్ : అమన్‌జీత్ సింగ్,
మహేశ్వరి చౌహాన్