
మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయానికి జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఫ్యాక్టరీ చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఎన్నారై బద్దం సంజీవరెడ్డి (కెనడా) రూ. 50వేలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు గురువారం విరాళం మొత్తాన్ని కమ్మర్ పల్లిలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి రూ.60వేలు విరాళంగా అందజేసిన బద్దం సంజీవరెడ్డికి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వారికి వారి కుటుంబానికి అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు బద్దం రాజశేఖర్, సింగిరెడ్డి శేఖర్, ముత్యంరెడ్డి, ధర్మయ్య, తదితరులు పాల్గొన్నారు.