కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి ఎన్నారై వల్లపురెడ్డి రాం రెడ్డి 5 వేల రూపాయల ఆర్థిక సాయం అందించి శనివారం మండలంలోని నారాయణగిరి గ్రామానికి చెందిన పసునూరి రాజు గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. కాగా విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, వల్లపురెడ్డి రాం రెడ్డి రాజుకు అండగా నిలిచారు. రాజు ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని రూ.5వేల రూపాయల ఆర్థిక సాయం అందించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో. పిఎసిఎస్ డైరెక్టర్ మడి కంటి రాజయ్య, మాజీ ఉప సర్పంచ్ పుట్ట కుమార్, మడి కంటి క వెంకన్న, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దుస్స రాజయ్య, నాయకులు గంటే కృష్ణ, భాష బోయిన రాజు, వక్కల వీరన్న, వక్కల కరుణాకర్, వక్కల యాదగిరి, వెంకటనారాయణ, రామన్న యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.